తెలంగాణాలో ఏపీ ఓటర్లు..తేలని లెక్క

తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఏపీలో విలీనమయితే అయ్యాయిగానీ..ఈ మండలాల ఓటర్లు మాత్రం ఇంకా తెలంగాణాలోని మూడు అసెంబ్లీ, రెండు లోక్ సభ నియోజకవర్గాల ఓటర్లుగా కొనసాగుతున్నారు.

వీరి ఓట్ల బదిలీ జరగకపోతే.. అది రాజ్యాంగంలోని 170 అధికరణాన్ని ఉల్లంఘించడమే అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అంటున్నారు. ఇదే విషయమై ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తూ.. 2014 ఎన్నికల తరువాత ఈ మండలాల బదిలీ జరిగిందని, ఇక్కడివారు తెలంగాణా ప్రజాప్రతినిధులకు ఓట్లు వేసినా ఇంకా ఏపీలోనే ఉన్నట్టు పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. రాజ్యాంగంలోని 170 ఆర్టికల్‌కు ఇది విరుద్ధం.. గతంలో నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తినా ప్రయోజనం లేకపోయింది అని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

Related News