ఎన్ని ఆపరేషన్ గరుడలైనా బాబును ఏమీ చేయలేరు

కేంద్రం ఎన్ని గరుడ ఆపరేషన్‌లు చేపట్టినా ఏపీ సీఎం చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు ఏపీ టీడీపీ నేత వర్ల రామయ్య. ఏపీ ప్రభుత్వాన్ని మోదీ, అమిత్ షా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబుకు సమస్యలు తెచ్చిపెట్టే కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని రామయ్య ఆరోపించారు.

ఇలాంటి దుందుడుకు చర్యలకు పూనుకొంటే బీజేపీకి పతనం తప్పదని, అవినీతి జగన్, అసమర్థ పవన్ కళ్యాణ్‌లను పక్కన పెట్టుకున్నా బాబును ఏమీ చేయలేరని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును ఇబ్బందుల పాల్జేసేందుకు కేంద్రం ఆపరేషన్ గరుడ చేపట్టనుందంటూ..సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Related News