అమెరికాలో భవిష్యత్ చెప్పిన చంద్రబాబు

టెక్నాలజీ మరియూ నేచర్ ని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇంతకుముందు టెక్నాలజీకి అధిక ప్రాముఖ్యత నిచ్చామని, ప్రపంచంలోనే గొప్ప సంస్థలకు సీఈవోలుగా భారతీయులు ఉండటమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. సామాన్యుడికి టెక్నాలజీ ఉపయోగపడేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితిలో నిర్వహించిన అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు(గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్ట్యునిటీస్) అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. సేంద్రీయ, ప్రకృతి సేద్యం రాబోయే రోజుల్లో అత్యధిక ప్రాధాన్యతా అంశంగా మారుతుందని అన్నారు. ఫెర్టిలైజర్స్ ఉపయోగించి పంటలు పండించడం భవిష్యత్ లో చాలా వరకూ తగ్గిపోతుందని.. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వ్యవసాయంలోకి మైగ్రేట్ అవ్వడం కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అన్నీ కాలుష్యకారకాలుగా మారిపోయాయని, వీటిని తిరిగి మామూలు స్థితికి రప్పించుకోవాల్సిన బాధ్యత మనందరిది అని అన్నారు.

Related News