బాబ్లీ ఘటనలో ఏ తప్పూ చేయలేదు..బాబు

బాబ్లీ ప్రాజెక్టు ఘటన, నోటీసులు, నాన్-బెయిలబుల్ వారంట్లపై మొదటిసారిగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు…ఈ ప్రాజెక్టు వల్ల. ఉత్తర తెలంగాణా  ఎడారిగా మారకూడదనే దీనికి వ్యతిరేకంగా పోరాడానని అన్నారు. బాబ్లీ కేసులో నాకు నోటీసులిచ్చామని అంటున్నారు. నేను నేరాలు గానీ, ఘోరాలు గానీ చేయలేదు. అన్యాయం అసలే చేయలేదు. ఏం చేస్తారో చేయండి అని ఆరోజే పోలీసులకు చెప్పాను. ఇప్పుడు నోటీసులు, అరెస్ట్ వారంట్లు అంటున్నారు. అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల కోసమే పని చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాల్లో వెలుగు వస్తుందో  అని ఆలోచించా..అంతే తప్ప నేనే తప్పూ చేయలేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద జలసిరికి హారతి ఇచ్చిన సందర్భంగా అయన ఈ మాటలన్నారు.

Related News