అన్న ‘భోజనం’ ఐదు రూపాయలే

ఏపీలో పేద, మధ్య తరగతి ప్రజలకు అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చేశాయి. బుధవారం విజయవాడలోని విద్యాధరపురం నుంచి ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సిటీకి వచ్చిన పేదలతో కలిసి భోజనం చేశారు.

తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 35 పట్టణాల్లో 100 క్యాంటీన్లు పనిచేయనున్నాయి. ఈ క్యాంటీన్‌ల ద్వారా రూ.5 కే భోజనం, టిఫిన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడుపూటలా రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని.. ఈ క్యాంటీన్ల ద్వారా కేవలం రూ.15 లకే పంపిణీ చేయడం గమనార్హం.

ఇందుకు సంబంధించిన క్యాటరింగ్‌ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థ నిర్వహిస్తోంది. ప్రతి క్యాంటీన్‌లో రోజుకు 250-300 మందికి ఆహారం అందనుంది.

READ ALSO

Related News