ప్రత్యేక హోదా అడిగితే ఇదే గతి.. డెమో చూపించిన బీజేపీ

ఏపీ బీజేపీయులు మళ్ళీ రెచ్చిపోయారు. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒంగోలు పర్యటనలో కార్యకర్తలు చేసిన ఓవరాక్షన్‌.. హెడ్‌లైన్ న్యూస్‌గా మారింది. కన్నా, పురందేశ్వరి సహా మరికొంతమంది నేతలు చేపట్టిన ర్యాలీలో నల్లటి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి.. ప్రత్యేక హోదా కావాలంటూ నినాదం చేయడంతో.. బీజేపీ కార్యకర్తలు అతడిపై బలప్రయోగానికి పాల్పడ్డారు.

చేతిలో ప్లకార్డును లాక్కుని చించేసి, అతడిని వెంటపడి తరిమితరిమి కొట్టారు. కిందపడేసి కాళ్ళతో తొక్కి నానా రభస చేశారు. నిరసన తెలిపి దెబ్బలు తిన్న బాధితుడిని ఆర్‌ఎంపి డాక్టర్‌ ఎం. శ్రీనివాసులుగా గుర్తించారు.

పోలీసులు వారిస్తున్నా వినకుండా జరిగిన ఈ దాడితో బీజేపీ అడ్డంగా బుక్కయ్యినట్లయింది. ఎవరైనా హోదా అడిగితే ఇదే గతి అన్నట్లుంది బీజేపీ వాళ్ళ ప్రవర్తన అంటూ విమర్శలు పడిపోతున్నాయి.

Related News