‘అంతకు మించి’ ట్రైలర్ రిలీజ్

ప్రముఖ యాంకర్, నటి రష్మి హీరోయిన్‌గా ఓ హారర్, థ్రిల్లర్ తెరకెక్కుతోంది. జై, రష్మి జంటగా నటించిన ఈ చిత్రానికి ‘అంతకు మించి’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. జానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్.. ఇది కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమని పేర్కొన్నారు.

జై, రష్మి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, హారర్, థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలతో తీసిన ‘అంతకుమించి’ సినిమా ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఎస్.జై ఫిలిమ్స్ పతాకంపై సతీష్ గాజుల, ఏ.పద్మనాభ రెడ్డి ఈ మూవీ నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు.

Related News