మరో డర్టీపిక్చర్ ‘పండుకారం’

కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ‘సిల్క్’ మూవీ తెలుగు ప్రేక్షకుడ్ని కూడా వశం చేసుకోడానికి సిద్ధమైంది. ఈ సినిమా పూర్తి పేరు ‘సిల్క్ సక్కట్ మగ’. శాండల్‌వుడ్‌లో పాతిక కోట్లు రాబట్టిన లోబడ్జెట్ మూవీ. పాకిస్తాన్ నటి వీణామాలిక్ సౌతిండియన్ ఇండస్ట్రీకి ఈ చిత్రంతోనే పరిచయమైంది. సిల్క్ స్మిత లైఫ్ స్టోరీ నేపథ్యంతో వచ్చిన ‘డర్టీపిక్చర్’కి ఇది నకలుగా చెప్పుకోవచ్చు.

సినిమాల్లో సెటిల్ కావడానికి ‘దేనికైనా రెడీ’ అంటూ చివరివరకూ గట్టిగా నిలబడ్డ ఒక అమ్మాయి కథను డైరెక్టర్ త్రిశూల్ తెరకెక్కించాడు. కాసింత మసాలా ఎక్కువగా ఉండడంతో కన్నడ యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసిందీ మూవీ. ఈ స్పైస్‌తో పాటు వీణామాలిక్‌కున్న క్రేజ్‌ని సొమ్ము చేసుకోడానికి తెలుగు నిర్మాతలు కూడా సిద్ధమయ్యారు.

ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌కి ‘రెడ్‌ మిర్చి’ అని పేరు పెట్టి.. అతికష్టం మీద సెన్సార్ క్లియరెన్స్ కూడా తెచ్చుకున్నారు. నైన్ మూవీస్ బేనర్ మీద.. సెప్టెంబర్ 28న విడుదల కాబోతున్న ఈ మూవీ టాలీవుడ్‌లో ఏం మాయ చేస్తుందో చూడాలి. కన్నడలో 150 రోజులాడింది.. తెలుగులో 50 రోజులైనా ఆడదా అంటూ ఆశగా వున్నారు ప్రొడ్యూసర్లు.

Related News