జంట పేలుళ్ళ కేసు.. ఇద్దరికి ఉరి!

హైదరాబాద్ జంట పేలుళ్ళ కేసులో మరో నిందితుడ్ని కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితులకు ఆశ్రయం కల్పించిన మహ్మద్ తారిఖ్ అంజుమ్ ఎహసాన్‌ను దోషిగా సోమవారం న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఈ కేసులో దోషుల సంఖ్య మూడుకు చేరింది. గతవారం ఏ-1 నిందితుడు అనీక్ షరీఫ్, ఏ-2 నిందితుడు అక్బర్ ఇస్మాయిల్ లను కోర్టు దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఇద్దరు నిందితులకు శిక్షలు ఖరారు చేసింది చర్లపల్లి ప్రత్యేక కోర్టు. దోషులుగా తేలిన అక్బర్, అనీక్ సయ్యద్ కు ఉరిశిక్ష పడింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజుమ్ ను యావజ్జీవ శిక్షతో సరిపెట్టింది. 11 ఏళ్ల కిందటి ఈ ఘటనకు సంబంధించిన కేసు ఇప్పటికి కొలిక్కి వచ్చినట్లయింది. 2007 ఆగస్టు 25న లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లో జరిగిన పేలుళ్లలో 45 మంది మృత్యువాతన పడగా, 68 మంది గాయపడి నాటి పీడకలను మర్చిపోలేక మథనపడ్తున్నారు.

Related News