గుహ నుంచి మరో నలుగురు.. థాయ్ ఆపరేషన్ ఫైనల్

థాయ్‌లాండ్ గుహ నుంచి మరో నలుగురు చిన్నారులను బయటకి తీసుకువచ్చారు. ఇవాళ మూడో దశ ఆపరేషన్ నిర్వహించి కోచ్ సహా మిగిలిన నలుగురిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గుహలో మొత్తం చిక్కుకుపోయింది 13 మందికాగా, ఇప్పటి వరకు 8 మందిని వెలికితీసుకొచ్చారు. బయటకు తీసుకువచ్చిన చిన్నారులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బయటపడిన నలుగురు విద్యార్థుల వివరాలు బయట పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. వారిని అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్నప్పుడు ముఖాలు మీడియాకు కనిపించకుండా తెల్లటి గొడుగులను అడ్డం పెట్టారు.

థాయ్‌లాండ్‌ ప్రధాని ప్రయుత్‌ చాన్‌ఓచా సంఘటన స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. నాలుగునెలలవరకూ బాలలను బయటకు తీసుకొచ్చే అవకాశం లేదని భావించినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో చిన్నారులు బాహ్యప్రపంచాన్ని చూస్తున్నారు.

Related News