ప్రెగ్నెన్సీపై నేహా సైలెంట్!

బాలీవుడ్ బ్యూటీ నేహా‌ధూపియా ప్రెగ్నెన్సీ వార్తలపై సైలెంట్ అయ్యాడు ఆమె భర్త అంగద్‌బేడి. ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అంగద్, మాకు ఒక ప్లాట్ ఫారం ఇచ్చారంటే, వారితో అనుబంధం కలిగివుంటారు.. దాన్ని దుర్వినియోగం చేయకూడదని అన్నాడు. ఇటువంటి వార్తలు వస్తున్నప్పుడు ఓ భర్తగా ఖండించకుండా ఉండలేనని, తమ గురించి మంచిగా మాట్లాడకపోయినప్పటికీ, తప్పుగా మాత్రం మాట్లాడకండి అంటూ వివరణ ఇచ్చుకున్నాడు.

అంతేగానీ, నేహా ప్రెగ్నెన్సీ అవునా? కాదా? అన్న విషయాన్ని నేరుగా ప్రస్తావించలేదు. ఇటీవల ఈ జంట మాల్దీవులు టూరేసింది. ఈ సందర్భంగా కొన్ని పిక్స్‌ని అభిమానులతో షేర్ చేసింది. దీంతో నేహా ప్రెగ్నెంట్ అంటూ జోరుగా ప్రచారం సాగింది. అన్నట్టు మ్యారేజ్‌కి ముందే నేహా ప్రెగ్నెన్సీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు హంగామా చేశాయి. ఈ విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందంటూ బీటౌన్ కోడై కూసిన విషయం తెల్సిందే!

Related News