ఈ పాపం ఎవరిది?

అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కల్యాణి గెర్డావ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో మృత్యువు విషం చిమ్మింది. ఆ విషవాయువులకు పొట్టకూటికోసం ఫ్యాక్టరీలో పనిచేసే ఆరుగురు అమాయకులు ఉక్కిరిబిక్కిరై ప్రాణాలొదిలారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

ముడి ఇనుమును వేడి చేసి కడ్డీలుగా మార్చే ప్లాంటు ఇది. ఆ సమయంలో 1470 సెంటీగ్రేడ్ల హీట్‌ ఉంటుంది. ఈ ప్లాంటులో వెలువడే విషవాయువులు బయటకు పంపించడానికి ప్రత్యేకంగా వేసిన పైపు లీకై విష వాయువు ప్లాంటు అంతా వ్యాపించింది. దీంతో తొమ్మిదిమంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత కొద్దిసేపటికే వారిలో ఆరుగురు చనిపోయారు.

ఈ దుర్ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల పరిహారం ప్రకటించింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి.. మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షలు చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. స్పర్శ సేవాసంస్థ ద్వారా ఒక్కొక్కరికి మరో రూ. లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

చనిపోయిన వారి కుటుంబాలు సోకసంద్రంలో మునిగిపోవడంతో ఆ ప్రాంతమంతా భీతావహవాతావరణం నెలకొంది. కార్మికుల భద్రతపై నిర్లక్ష్యం వహించిన ఫ్యాక్టరీ యానమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related News