టీడీపీకి ఆనం షాక్..! త్వరలోనే పార్టీకి టాటా..

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సేఫ్ ప్లేస్ కోసం నేతల వేట మొదలైపోయింది. ఏ పార్టీకి విజయావకాశాలున్నాయి? ఏ పార్టీలో ఉంటే తమకు వర్కౌటౌతుందని వేసుకున్న లెక్కల ఫలితాలు దాదాపు తేలిపోనుండటంతో ఆయా పార్టీలవైపు చూస్తున్నారు నేతలు. తాజాగా ఈ జాబితాలో నెల్లూరుజిల్లా టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి పేరు వినిపిస్తోంది.

‘మీరు పార్టీ మారబోతున్నారట కదా?’ అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆనం సమాధానమిచ్చారు. గౌరవం లేని చోట తాను ఉండలేనంటూ తేల్చి చెప్పి.. టీడీపీని వదిలేస్తున్నట్టు చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు, తాను గతంలో ఎన్నో పదవులు చేపట్టానని, సమర్థంగా పనిచేశానని పేర్కొన్నారు. గుర్తింపు, గౌరవం లేని చోట తాను ఉండలేనని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆనం బ్రదర్ టీడీపీని వీడటం ఖాయమని తేలిపోయింది. నెల్లూరు జిల్లాలో తమకెంతోమంది అభిమానులున్నారని, వాళ్లతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఆయన నిన్న నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలను కలవడం కూడా దీనికి సంబంధించేనని తెలుస్తోంది.

READ ALSO

Related News