నెట్‌లో ఆమ్రపాలి తుపాన్

భోజ్‌పురి నటి ఆమ్రపాలి దుబే తొలిసారి వార్తల్లోకి వచ్చేసింది. ఆమె నటించిన ‘లవ్‌‌కే లియే కుచ్‌ బి కరేగా’ మూవీలోని తోహరే ఖతిర్‌ అనే సాంగ్‌ని యూట్యూబ్‌ పోస్ట్ చేసింది యూనిట్. తన టీమ్‌తో నటి ఆమ్రపాలి వేసిన బెల్లి డ్యాన్స్ స్టెప్పులకు సినీ‌లవర్స్ ఫుల్ ఖుషీ. తెలుపు, ఎరుపు కలర్స్‌ డ్రెస్‌లో ఆమ్రపాలి మరింత అందంగా కనిపించింది. ఈ వీడియోకు వస్తున్న స్పందన చూసి యూనిట్ హ్యాపీగా ఫీలవుతోంది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ షోల్లోనూ తనదైన ముద్ర వేసుకుంది ఈ నటి. నిరాహువా హిందూస్తానీ మూవీతో నాలుగేళ్ల కిందట భోజ్‌పురి ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇప్పుడక్కడ అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. ఈ సాంగ్‌తో మిగతా చిత్ర పరిశ్రమల నుంచి ఈమెకి అవకాశాలు ఊపందుకోవడం ఖాయమని అంటున్నారు.

READ ALSO

Related News