‘లండన్ లవ్’.. ఫస్ట్ టైమ్

బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్, ఆయన మనవరాలు కలిసున్న పిక్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ ఫొటోని షేర్‌ చేసింది బిగ్ బీ కాదండోయ్.. ఆయన కోడలు ఐశ్వర్యరాయ్‌. ప్రస్తుతం ఐష్ తన ఫ్యామిలీతో కలిసి లండన్‌లో ఉంది. నార్మల్‌గా ఐశ్వర్య, అభిషేక్‌, ఆరాధ్యల పిక్స్‌ని చూస్తూనేవుంటాం. కానీ తాతతో ఈ విధంగా కనిపించడం ఇదే తొలిసారి.

బిగ్‌ బీ చిరునవ్వుతూ కనిపించగా, ఆరాధ్య ఆయన భుజాలపై చేతులు వేసి కెమెరాకు పోజులిచ్చింది. మా బంధం చాలా దృఢమైందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘లండన్‌ ప్రేమ’ అంటూ చిన్న క్యాప్షన్‌ పెట్టింది ఐశ్వర్య. కొంతకాలంగా ఐశ్వర్య.. ఏ వేడుకకు వెళ్లినా తన కూతుర్ని తీసుకెళ్తోంది. ఆరాధ్యని తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్స్ క్యూ కడుతున్నారు. ఇప్పుడు తాతతో హంగామా చేస్తోంది. మొత్తానికి చిన్ని వయసు లోనే ఆరాధ్య పాపులర్ అయిపోయింది. రీసెంట్‌గా సాకర్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ కోసం అమితాబ్ ఫ్యామిలీ రష్యాకి వెళ్లింది. మ్యాచ్ తర్వాత అక్కడినుంచి ఫ్రాన్స్ మీదుగా లండన్ వెళ్లింది.

💕London love ✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

 

READ ALSO

Related News