కేసీఆర్‌కు అమిత్ షా ప్రశ్నలు

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. తన కుటుంబ పాలనను సుస్ధిరం చేసుకోవడానికే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. దీనివల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని గతంలో సమర్ధించిన కేసీఆర్, ఇప్పుడు తొమ్మిది నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లారని ప్రశ్నించారు. 2014లో తెలంగాణకు దళితుడ్ని సీఎంని చేస్తానన్న ఆయన మాట ఏమైంది, వాస్తు పిచ్చితో నాలుగున్నరేళ్లగా సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి ఆయనేనని ఎద్దేవా చేశారు.

రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కడతామన్న కేసీఆర్, లబ్ధిదారులకు ఎన్ని ఇళ్లను పంపిణీ చేశారో చూపించాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ తరహా కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్నికల పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు చేరుకున్న షా, బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Related News