శబరిమల.. సెంటిమెంట్‌‌ని కాపాడాలి-ఆర్ఎస్ఎస్ చీఫ్

48 గంటలుగా నలుగుతున్న శబరిమల వివాదంపై స్పందించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భక్తి విషయంలో సమానత్వం పాటించాల్సిందే కుండబద్దలు కొట్టేశారు. సెంటిమెంట్‌ని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. మహిళలను ఆలయంలోకి అనుమతించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. సంప్రదాయాలకే భక్తులు ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని మరవరాదన్నారు.

చాలామంది మహిళల్లో కూడా దీన్ని అంగీకరిస్తున్నారని గుర్తుచేశారు. కొన్నేళ్లుగా సమాజం ఈ సంప్రదాయాన్ని పాటిస్తోందని, అందువల్లే ఈ తీర్పుని ఎవరూ పట్టించుకోలేదన్నారు. వివిధ మత గురువుల అభిప్రాయాలను, కోట్లాది ప్రజల మనోభావాలను సుప్రీంకోర్టు పక్కనపెట్టిందన్నారు. విజయదశమి సందర్బంగా మాట్లాడిన ఆయన, ఈ వ్యాఖ్యలు చేశారు.

Related News