అమరావతి ఐకాన్ టవర్ ఇదే!

అమరావతిని భవిష్యత్తులో ఇన్నోవేషన్ వ్యాలీగా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలోని రాయపూడివద్ద ఎన్నారైలకు నిర్మించదలచిన ఎన్.ఆర్.టీ ఐకాన్ టవర్ నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబు.. ప్రవాసాంధ్రులు ఏ దేశంలో స్థిరపడినా జన్మభూమిని మాత్రం మరిచిపోరాదని పేర్కొన్నారు.


అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఎక్కువమంది తెలుగువారే ఉన్నారు. ఇన్నోవేషన్ వ్యాలీ అంటే ఇక అమరావతే గుర్తుకు రావాలి అని చంద్రబాబు చెప్పారు. కాగా- ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐకాన్ టవర్ నిర్మించనున్నారు.


ఎన్నారైల నుంచి సేకరించిన రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో 36 అంతస్తులుగా ఈ టవర్ రూపు దిద్దుకోనుంది. కొరియాకు చెందిన స్పేస్ కార్పొరేషన్ ఈ భవన ఆకృతిని రూపొందించడం విశేషం.

 

Related News