మండుతున్న సిలిండర్‌తో చంపబోయాడు

అలహాబాద్‌లోని కిడ్‌గంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఒక మహిళను మండుతున్న సిలిండర్‌తో చంపబోయాడు. ఈ షాకింగ్ ఘటన సీసీటీవీ కెమెరాల్లో  రికార్డయింది. ఆ కిరాతకుడ్ని అఫ్తాబ్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఆమెపై ఆగ్రహంతో ఇతగాడు ఇలా వెంటబడగా..ఆమె తప్పించుకుని పరుగులు పెడుతూ ప్రాణాలు దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆ మహిళ పేరు ఉస్మానా అన్సారీ అని, సుమారు మూడేళ్ళ క్రితం తన ఇంటిని అతనికి అద్దెకు ఇచ్చిందని తెలిసింది. అయితే అఫ్తాబ్ అద్దె చెల్లించకపోవడంతో..ఆమె ఇల్లు ఖాళీ చేయాలని కోరిందట. ఇది సహించలేని  అతగాడు మండుతున్న సిలిండర్ పట్టుకుని ఆమె వెంటపడ్డాడు. ఆ సిలిండర్ మంటల్లో పేలిపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అంటున్నారు. ఈ వీడియో వైరల్ అయింది. అయితే అఫ్తాబ్ తప్పించుకుని  పారిపోయినట్టు కనిపిస్తోంది. పోలీసులు అతడికోసం గాలిస్తున్నట్టు సమాచారం.

Related News