ఫిల్మ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

తన రూటే సెపరేట్ అని అంటోంది నటి ట్వింకిల్ ఖన్నా. రచయిత్రిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె, సినిమాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. తన ఫిల్మ్‌ని ఎలాగైనా నిషేధించాలంటూ కోరారు. ట్వింకిల్ రాసిన ‘పైజమాస్ ఆర్ ఫర్‌గివింగ్’ పుస్తకం రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడింది. మీరు నటించిన సినిమాల్లో ఏది ఇష్టం? వాటిని రీమేక్ చేయాలని భావిస్తారా? అని ప్రశ్నించారు.

తాను నటించిన ఏ మూవీ హిట్ కాలేదని, సక్సెస్ అయిన వాటిల్లో నటించలేదని తెలిపారు ట్వింకిల్. అందుకే ఆ సినిమాలను నిషేధిస్తే.. వాటి రీమేక్ జోలికి ఎవ్వరూ వెళ్లరని సూటిగా చెప్పేశారు. హిట్ మూవీలు చేయలేదు కనుక తనకు మతిమరుపు ఉండటం ఈ విధంగా కలిసొచ్చిందని చమత్కరించారు. తెలుగులో శ్రీను, హిందీలో బర్సాత్, ఇతిహాస్, జుల్మి, మేలా వంటి చిత్రాల్లో నటించారు ఆమె. ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి హీరో అక్షయ్‌కుమార్‌ను మ్యారేజ్ చేసుకున్న విషయం తెల్సిందే!

Related News