విజయవాడ విమానానికి తప్పిన ముప్పు

విజయవాడ నుంచి ముంబై వెళ్లిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ IX 213 నెంబరు గల ఈ విమానం.. మంగళవారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో ముంబై ఎయిర్‌పోర్టులో రన్‌వేపై దిగింది. ఐతే, విమానం అదుపు తప్పి రన్‌వేపై జారింది.. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు.

వెంటనే ఇంజినీర్లు హుటాహుటీన రన్‌వే పైకి చేరుకొని విమానాన్ని పరిశీలించినట్టు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రతినిధులు తెలిపారు. కొన్నిరోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాల కారణంగా వందకు పైగా వివిధ కంపెనీలకు చెందిన విమానాలను రద్దు చేశారు. ఈ క్రమంలో అక్కడి ఎయిర్‌‌పోర్టు ప్రధాన రన్‌వేను బుధవారం వరకు మూసివేశారు అధికారులు.

Related News