కమల్, రజినీలు జోకర్లు- అన్నాడీఎంకె సెటైర్లు

తమిళనాడులో అన్నాడీఎంకె పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆ పార్టీ పత్రిక ‘నమదు అమ్మ’ కమల్‌హాసన్, రజినీకాంత్‌ లను జోకర్లంటూ వ్యంగ్యంగా ఆరోపణలు గుప్పించింది. ఈ మేరకు పత్రిక ప్రచురించిన కవితలో కమల్‌ని ‘పిరికివాడి’గా వర్ణించింది. జయలలిత వున్నప్పుడు దేశం విడిచివెళ్లిపోతానన్న ఓ పిరికివాడు సైతం.. ఆమె మరణం తర్వాత ‘మక్కళ్ నీది మయ్యమ్’ అనే పార్టీని ‘ధైర్యం’గా ప్రారంభించాడని పరిహసించింది. ఓ టాప్ నటుడు కూడా సొంతంగా పార్టీ పెట్టేందుకు తహతహలాడుతున్నారని అందులో ప్రస్తావించింది. ఇలాంటి జోకర్ల గ్యాంగ్‌ వుంటే జయలలిత ఒక్కరోజూ కూడా సెక్రటేరియెట్‌కి రాలేరంటూ సెటైర్ వేసింది.

Related News