తెలుగు తెరకి మరో కొత్త వారసుడు!

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీదకి మరో నట వారసుడు రాబోతున్నాడు. అతనెవరోకాదు.. బుల్లితెరపైనా.. వెండితెరపైన తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుని ప్రస్తుతం ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఫుల్ బిజీగా ఉన్న శివాజీరాజా తనయుడు విజయ్ రాజా.

అంతేకాదు, విజయ్ రాజా హీరోగా ఒక సినిమా పూజా కార్యక్రమాలు కూడా బుధవారం జరిగిపోయాయి. డెబ్యూ డైరెక్టర్ రమాకాంత్ రూపొందించే ఈ సినిమాకి ‘ఏదైనా జరగొచ్చు’ అనే టైటిల్ ఖరారు చేశారు కూడా.

కొత్త హీరో, కొత్త దర్శకుడితో తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా పైనల్ కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని మూవీ యూనిట్ అంటోంది. ‘బిగ్ బాస్ 2’ షోకి సంబంధించిన ప్రోమోల ద్వారా ‘ఏదైనా జరగొచ్చు’ అనే మాట బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే.

READ ALSO

Related News