చంద్రబాబును ఆ పని చేయండి? జగన్, పవన్ ఎందుకు సైలెంట్? బీజేపీపై శివాజీ గరంగరం

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు టాలీవుడ్ నటుడు శివాజీ. చంద్రబాబుపై కోపం పెట్టుకుని.. ప్రజలను బీజేపీ హింసించే బదులు అదేదో చంద్రబాబునే ఎన్‌కౌంటర్ చేస్తే ఓ పని అయిపోతుందా అని అన్నారు. శుక్రవారం రాత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీలో ఐటీ దాడుల వెనక కేంద్రానికి ప్రత్యేక లక్ష్యం ఉందని ఆరోపించారు.

నలుగురు దుర్మార్గులు ఢిల్లీలో కూర్చుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, ఐటీ దాడుల వెనక ఓ వ్యక్తి ఉన్నాడని, అతడే అధికారులకు సమాచారాన్ని అందిస్తున్నాడని ఆరోపించారు. దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న రాఫెల్ కుంభకోణం నుంచి ప్రజల దారి మళ్లించడానికే ఐటీ దాడులతో బీజేపీ బెంబేలెత్తిస్తోందని విమర్శించారు. అటు పవన్, ఇటు జగన్‌లపైనా ప్రశ్నలు సంధించారు నటుడు శివాజీ. చెప్పుడు మాటలు విని పవన్ హోదా గురించి మర్చిపోయారని, నవంబరు రెండున హోదా సైన్యంతో రహదారులపై ఆందోళనలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

 

Related News