కారు యాక్సిడెంట్, నటులు దర్శన్, దేవరాజ్‌లకు గాయాలు

నటుడు దర్శన్, సీనియర్ యాక్టర్ దేవరాజ్‌లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నటుల చేతికి గాయాలయ్యాయి. షూటింగ్ ముగించుకుని సోమవారం ఉదయం మైసూర్ నుంచి బెంగుళూరుకి కారులో వస్తున్న సయమంలో దర్శన్‌, దేవరాజ్, ప్రజ్వల్‌లతోపాటు మరొకరు ప్రయాణిస్తున్నారు.

కారు మైసూరు రింగ్ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. దేవరాజ్‌కి చాతీలో, ప్రజ్వల్‌కి నెక్‌లో గాయాలు కాగా, దర్శన్‌కి చేయి విరిగినట్టు తెలుస్తోంది. గాయపడిన వీళ్లని మైసూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్శన్ భార్య మీడియాతో  మాట్లాడారు.

 

Related News