వైరల్ వీడియో..మహిళపై షార్క్ ఎటాక్

కాసేపు సముద్రంలో సేద తీరాలని భావించింది ఆ మహిళ. పడవలో నిలబడి అలలతో ఆడుకుంటుండగా ఓ షార్క్‌ ఆమెపై దాడి చేసింది. ఐతే, బోటులోవున్న మహిళ ఫ్రెండ్స్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని టూరిస్ట్ ప్రాంతం కింబెర్లీ సముద్ర తీరం.

బోటులో ప్రయాణిస్తుండగా నాలుగు షార్క్‌లు తమ పడవ చుట్టూ చేరాయని, అందులో ఒకటి తనపై దాడి చేసి వేలు కొరికేసిందని చెప్పింది బాధితురాలు మెలిస్సా బర్నింగ్‌. ఈ ఘటనలో షార్క్‌ తప్పేమీలేదని చెప్పుకొచ్చింది. షార్క్‌ కావడంతో తాను బతికి బయపడ్డానని, అదే మొసలి అయితే తన పనైపోయినట్టేనని తెలియజేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫుటేజీని ఓ ఛానల్‌ ప్రసారం చేయడంతో ఈ వీడియో వైరల్‌ అయింది.ఈ ఘటన మే లో జరిగింది.

Related News