హైదరాబాద్‌లో దారుణం, యూకేజీ బాలికపై అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. చాక్లెట్ల ఆశ చూపి నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలిక బంధువులు.. స్థానిక అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. స్కూలుపై రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అదనపు బలగాలను దింపి ఆందోళనకారులను చెదరగొట్టారు.

A Rape case of a 4years nursery student of #Azaanschool #tolichowki has been reported .Police investigating the matter…#TheHyderabadTimes

Posted by The Hyderabad Times on Friday, September 14, 2018

టోలిచౌకిలోని అజాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో అదే ప్రాంతానికి చెందిన నాలుగున్నరేళ్ల బాలిక యూకేజీ చదువుతోంది. పాఠశాలలో శానిటేషన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసే జిలానీ.. శుక్రవారం మధ్యాహ్నం బాలికకు చాక్లెటు ఆశ చూపి అత్యాచారం చేశాడు. ఇంటికొచ్చిన బాలికకు రక్తస్రావం అయ్యింది. దీంతో విషయం తెలుసుకున్న బాలిక పేరెంట్స్ పాఠశాలకు చేరుకుని ఆందోళన చేశారు. ట్రీట్‌మెంట్ నిమిత్తం బాలికను నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. జిలానీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related News