బాబుకి మనవడి సెంటిమెంట్

ఇటు తెలంగాణ సీఎం ముందస్తు సందట్లో మునిగితేలుతుంటే.. అటు ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం.. ప్రభుత్వ కార్యక్రమాలతో తలమునకలవుతున్నారు. వినాయకచవితి ముందురోజు పోలవరం గ్యారేజ్ వాక్ పేరుతో కుటుంబ సమేతంగా హడావిడి చేశారు. తోటి మంత్రులు, ఎమ్మెల్యేల్ని కూడా వెంటబెట్టుకుని పోలవరం గారేజ్‌లో కిలోమీటరు మేర మనవడు దేవాన్ష్‌తో కలిసి నడిచి ఫోటోలకు పోజులిచ్చారు. మరుసటిరోజు గణనాధుడి పూజలో నిమగ్నమయ్యారు. శుక్రవారం తిరుమల వెళ్లిన చంద్రబాబు.. వెంకటేశుని సేవలో తరించారు. బ్రహ్మోత్సవాల అంకురార్పణ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ప్రార్థించానంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ కూడా మనవడ్ని ఎక్స్‌పోజ్ చేయడాన్ని విస్మరించలేదు.

Related News