రాకాసి మొసలిని పట్టుకున్నారు

ఆస్ట్రేలియాలోని కేథరిన్ నదీ జలాల్లో ఉన్న రాకాసి మొసలి ఎట్టకేలకు పట్టుబడింది. 600 కేజీల బరువు, 15.4 అడుగుల పొడవు ఉన్న ఈ భారీ మొసలి కోసం అక్కడి వైల్డ్ లైఫ్ రేంజర్లు ఎనిమిదేళ్లుగా మాటు వేశారు. 2010 లో ఒకసారి ఇది వారికి కనిపించింది. సుమారు 60 ఏళ్ళ వయస్సుదిగా భావిస్తున్న ఈ మొసలి ఏడాదికి కనీసం ఇద్దరు మనుషులను స్వాహా చేస్తుందట.

ఉప్పు నీటిలో నివసించే మొసళ్ళు మనుషులను కూడా తినేస్తుంటాయని, ఇది ఆ జాతికి చెందినదని రేంజర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు తాము పట్టుకున్న మొసళ్ళలోకెల్లా ఇది అతి పెద్దదని, దీన్ని పట్టుకునేందుకు ఎంతగానో శ్రమించామని వారన్నారు. దీన్ని జనావాస ప్రాంతాలకు దూరంగా ప్రత్యేక ప్రదేశానికి తరలిస్తామన్నారు. ఈ రేంజర్లు ఏటా సుమారు 250 మొసళ్ళను పట్టుకుంటూ ఉంటారట.

READ ALSO

Related News