న్యూస్ పేపర్ ఆఫీస్‌లో కాల్పులు.. ఐదుగురు హతం..

క్లాస్ రూమ్స్, రెస్టారెంట్లు దాటి.. మీడియా హౌస్‌లోకి జొరబడింది అమెరికన్ గన్ కల్చర్. అమెరికన్ మీడియా చరిత్రలోనే అతి దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

మేరీలాండ్ రాజధాని నగరం అనాపొలీస్ ప్రాంతంలోని క్యాపిటల్ గెజిట్ అనే న్యూస్ పేపర్ గ్రూప్ కార్యాలయంలోకి గురువారం ఒక ఆగంతకుడు జొరబడ్డాడు. గ్లాస్‌డోర్‌లోంచి చూస్తూ.. మెషిన్ గన్ ఎక్కుపెట్టి.. కనిపించినవాళ్లను కనిపించినట్లు కాల్చిపారేశాడు.

ఈ అనూహ్య ఘటనతో ఆ ప్రాంతమంతా అలజడి రేగింది. వార్‌జోన్‌ని తలపించింది. డెస్క్‌లో పని చేసుకుంటున్న ఐదుగురు జర్నలిస్టులు అక్కడికక్కడే మరణించారు. మిగతావారంతా టేబుల్స్ కింద దాక్కోవడంతో అతడు ఫైరింగ్ ఆపి.. తుపాకీని రీలొడింగ్ చేసుకోబోయాడు.

ఈలోగా 911 నంబర్‌కు ఫోన్ చేయగా.. ఒకేఒక నిమిషంలో అక్కడికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన మనిషిని అదుపులోకి తీసుకున్నారు. అగంతకుడిని 30 ఏళ్ల తెల్లజాతి యువకుడిగా గుర్తించారు. ఘటనపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

Related News