ఫైవ్ స్టార్ హోటల్లో ఫైర్

లక్నోలోని ఓ ఫైర్ స్టార్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా..అయిదుగురు గాయపడ్డారు. ఏడంతస్తుల హోటల్ విరాట్  ఇంటర్నేషనల్ లో మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో హఠాత్తుగా మంటలు రేగి క్రమంగా అన్ని అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 50 మందిని రక్షించినట్టు పోలీసులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్లకు సుమారు రెండు గంటలు పట్టింది. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. హోటల్ ముందు భాగం చాలావరకు దగ్ధమైంది.

Related News