విలీన ఏడు మండలాల ఓటర్లు ఏపీలో

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాల ఓటర్లను ఏపీ ఓటర్ల జాబితాలో కలిపినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. దీంతో ఆ మండలాల ఓటర్లు ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటారు. ఈ మండలాలకు సంబంధించి తాము ఓటర్ల జాబితాను రూపొందించినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల మేరకు ఆ ఏడు మండలాలను రంపచోడవరం (ఎస్టీ), పోలవరం (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపినట్టు తెలియజేశారు. ఓటర్ల వివరాలను తెలంగాణ ఎన్నికల సంఘం నుంచి తీసుకుని ఏపీ ఓటర్ల జాబితాలో కలిపామని, పోలింగ్‌ కేంద్రాలు కూడా ఏపీలోనే ఉన్నాయని వెల్లడించారు.

Related News