రాజ్యసభలో ఇక కొత్త ఒరవడి

రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో 22 భాషల్లో ఏ భాషలోనైనా సభ్యులు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రకటన రిలీజ్ చేశారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే రాజ్యసభ సమావేశాల నుంచి ఈ వెసులుబాటు ఉంటుంది. మాతృభాషలోనే మన భావాలను, ఆలోచనలను ఎటువంటి ఆటంకం లేకుండా స్పష్టం చేయగలమని.. మాతృభాషే సహజ మాధ్యమంగా తాను భావిస్తానని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు చెప్పారు.

రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న భాషలకు సంబంధించిన వ్యాఖ్యాతలు ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు. తాజాగా డోగ్రీ, కశ్మీరీ, కొంకణి, సంతాళి, సింధీ భాషలకు చెందిన వ్యాఖ్యాతలను నియమించారు. వారికి శిక్షణానంతర సర్టిఫికేట్లను వెంకయ్య నాయుడు మంగళవారం అందజేశారు. బహు భాషల నిలయమైన పార్లమెంటులో భాషా పరిమితుల దృష్ట్యా ఏ ఒక సభ్యుడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 22 భాషల్లో మాట్లాడే సదుపాయాన్ని కల్పించామని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు వెల్లడించారు.

Related News