పట్టపగలు ‘అర్జున్‌రెడ్డి’ బ్యూటీ రొమాన్స్

‘అర్జున్ రెడ్డి’ ఫేం హీరోయిన్ షాలినిపాండే పట్టపగలు రొమాన్స్. ఇంతకీ ఎవరో తెలుసా? కోలీవుడ్ నటుడు జీవీ ప్రకాష్ కుమార్‌తో. వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న మూవీ ‘100% కాద‌ల్’. వినాయక చవితి సందర్భంగా సినిమా టీజర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. స‌న్నివేశాలన్నీ తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన‌ట్టే ఉన్నాయి. కాకపోతే షాలిని రొమాన్స్ విషయంలో కాస్త స్పీడ్ పెంచిందనేది కోలీవుడ్ టాక్.

2011లో టాలీవుడ్‌లో రిలీజైన ‘100 % లవ్‌’కి ఇది రీమేక్. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని తొలుత బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.. దీంతో తమిళంలో త‌న శిష్యుడైన చంద్రమౌళితో రీమేక్ చేస్తున్నాడు దర్శకనిర్మాత సుకుమార్.

Related News