అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికా లాస్‌ఏంజిల్స్‌లోని సూపర్ మార్కెట్‌లో శనివారం సాయంత్రం ఓ దుండగుడు కాల్పులతో కలకలం సృష్టించాడు. సుమారు 40 మందిని బందీలుగా పట్టుకున్న ఇతగాడు.. ఇద్దరు మహిళలపై ఏడు రౌండ్లు కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో అతని గ్రాండ్‌మదర్ మరణించగా..అతని ప్రియురాలు స్వల్పంగా గాయపడింది. కాల్పులు జరిపిన అనంతరం ఈ దుండగుడు తన గర్ల్ ఫ్రెండుతో కారులో పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు అతని బారినుంచి బందీలను రక్షించి ..అతడ్ని పట్టుకోవడానికి యత్నించగా, మరో సూపర్ మార్కెట్‌లోకి పారిపోయాడు.

పెద్ద సంఖ్యలో పోలీసులు ఆ సూపర్ మార్కెట్ వద్ద మోహరించడంతో దాదాపు నాలుగు గంటల హైడ్రామా తరువాత ఆ దుండగుడు లొంగిపోయాడు. ఎడమ చేతికి గాయమైన అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనలో ఓ స్టోర్ ఉద్యోగిని ఒకరు మరణించింది.

READ ALSO

Related News