వైఎస్ బయోపిక్ ఫిక్స్.. బాబు రోల్‌పై సస్పెన్స్

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో టాలీవుడ్‌లో పొలిటికల్ సినిమాల హంగామా మొదలైంది. ఈనెలాఖరులో ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్‌కి దీటుగా వైఎస్ బయోపిక్ కూడా వెండితెరకి ఎక్కనుంది. ఇందుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. వైఎస్ పాత్రని నటుడు మమ్ముట్టి చేయనున్నాడు. అంతేకాదు త‌న పాత్రకి తానే డ‌బ్బింగ్ చెప్పుకోనున్నట్లు టాక్. డైరెక్టర్ మహి రాఘ‌వ త‌న ట్విట్టర్‌లో మ‌మ్ముట్టితో దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు.

 

 

మే నుండి సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ ప్రాజెక్ట్‌కి ‘యాత్ర’ అనే టైటిల్‌ పరిశీలనలో వుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వ‌ర్క్స్ పూర్తి చేసిన మ‌హి, న‌టీన‌టుల‌ ఎంపికలో నిమగ్నమయ్యాడు. రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ఘట్టాన్ని అరగంటపాటు చూపించనున్నారు. 30 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై విజ‌య్ చిల్లా- శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐతే, వైఎస్ రాజకీయ జీవితంలో ప్రతి నాయకుడు అనిపించుకున్న చంద్రబాబు రోల్ ఎవరు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Related News