భార్య గురించి వచ్చిన వార్తలపై జగన్ దిగ్భ్రాంతి

నా భార్యను ఉచ్చులోకి లాగుతారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిందితుల జాబితాలో తన భార్య భారతి పేరు ఉందంటూ ప్రత్యేకించి కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలు తనను షాకింగ్‌కు గురిచేశాయంటూ వాపోయారు. రాజకీయాలు ఇంతగా దిగజారిపోవడం బాధాకరమని.. చివరికి కుటుంబసభ్యులను కూడా వదలటం లేదంటూ  తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు జగన్. ఇలా ఉండగా, వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయ్యాయంటూ ఇవాళ కొన్ని ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయి. సీబీఐ వదిలేసినా భారతిని ఈడీ వదలలేదని.. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు ఆయన భార్య భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఈడీ.. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల అభియోగ పత్రం (చార్జిషీటు) దాఖలు చేసిందన్నది ఆయా వార్తల సారాంశం. దీనిపై జగన్ తన ట్విట్టర్ పోస్ట్‌లో ఇలా స్పందించారు.

READ ALSO

Related News