యెడ్డీ స్కెచ్ రెడీ.. గుప్పిట్లో 8 మంది ఎమ్మెల్యేలు!

‘ఐదేళ్లూ నావే’ అంటూ రెండువేళ్ళతో విక్టరీ సింబల్ చూపెడుతున్న బీఎస్ ఎడ్యూరప్ప.. సుప్రీమ్‌కోర్ట్ పెట్టిన డెడ్‌లైన్ దగ్గర పడుతున్నకొద్దీ ఏమాత్రం ‘తగ్గడం’ లేదు. తన వద్ద ఇప్పటికే 120 మంది ఎమ్మెల్యేలు వున్నారని, మరికొందరు కూడా ‘ఆన్ ద వే’ అనీ చెబుతున్నారు. ఎడ్డీ కనబరుస్తున్న ధీమా వెనుక అంతరార్థం ఏమిటంటూ కన్నడ మీడియా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఒకప్పుడు సిద్ధరామయ్య ప్లే చేసిన రిలీజియస్ సెంటిమెంట్‌కి రివర్స్ పంచ్ ఇవ్వాలన్నది ఎడ్యూరప్ప ప్రణాళికగా తెలుస్తోంది. ఏకంగా కొందరు స్వామీజీలనే లాబీయింగ్ కోసం రంగంలో దింపేసిందట కర్ణాటక బీజేపీ. కాంగ్రెస్ పార్టీకి చెందిన లింగాయత్ కమ్యూనిటీ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల అధిష్టానం ఎక్కమన్న బస్సునల్లా ఎక్కి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్లి తలదాచుకుంటున్న ఎమ్మెల్యేల్లోనే ‘తమ’ ఎమ్మెల్యేలున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటు.. హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల్లో నలుగురు ‘మిస్’ అయ్యారన్నది ఒకానొక విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై ఆయా పార్టీల నేతలు వ్యూహాత్మక ‘గోప్యత’ పాటించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయానికల్లా ‘జంపింగ్’ స్టార్స్‌పై మరింత క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది.

READ ALSO

Related News