వాళ్ళ కుట్రల్ని ఖండిస్తున్నా

కర్ణాటకలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప అన్నారు. కాంగ్రెస్, జేడీ-ఎస్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న నేపథ్యంలో.. మీడియాతో మాట్లాడిన ఆయన.. కన్నడ ప్రజలు మార్పును కోరుతున్నారని, ఇందుకు ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. అయినా.. కాంగ్రెస్, జేడీ-ఎస్ పార్టీలు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నాయని యడ్యూరప్ప మండిపడ్డారు.

సిద్దరామయ్య పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఒక్క చోటే..అదికూడా స్వల్ప మెజారిటీతో గెలిచారని, కన్నడిగులు మార్పును కోరుకుంటున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని ఆయన ప్రశ్నించారు. తనను గెలిపించిన షికారిపుర ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Related News