జగన్ బాషా గెటప్.. ఎక్కడ?

ప్రజా సంకల్పయాత్రను వీలైనంతవరకు పూర్తిగా ఫలవంతం చేసుకునే పనిలో పడ్డారు వైసీపీ అధినేత జగన్. జనంలో తిరుగుతూ, జనంతో మమేకం అవుతూ, జనంలోని అన్ని వర్గాలకూ దగ్గర కావాలన్న సంకల్పంతో ముందడుగేస్తున్న జగన్.. ఆ మేరకు పక్కా ప్లాన్ గీసుకుని దాన్ని ఫాలో అవుతున్నారు. కొన్ని చోట్ల సినిమాటిక్ ఫ్లేవర్ కూడా తప్పడం లేదు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో సాగుతున్న జగన్ పాదయాత్రలో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. మార్గమధ్యంలో తారసపడ్డ ఆటోవాలాలతో కలిసిపోయారు జగన్. ఆటో డ్రైవర్లలో తానూ ఒకడిగా మారి.. వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకుని.. అక్కడితో ఆగకుండా ఖాకీ చొక్కా వేసుకుని ఆటో స్టీరింగ్ పట్టుకుని హల్చల్ చేసుకున్నారు.

Related News