ఒక్క అరటిపండు 87 వేలు

కనిపిస్తున్న ఈ సింగల్ అరటిపండు ఖరీదు అక్షరాలా 87 వేలు. విచిత్రంగా వుందికదూ! అదే ఈ స్టోరీ తమాషా.. యూకెలోని నాటింగ్‌హామ్‌కి చెందిన బాబీ గార్డన్ అనే మహిళ సూపర్ మార్కెట్ నుంచి అరటిపండు తెప్పించుకోవడానికి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చింది. మహా అయితే కేవలం 11 పెన్స్ ధరలోపే వుండే ఈ పండు.. ఆమెకి చేరేసరికి ఏకంగా 930 పౌండ్లకు.. అంటే సుమారు 87 వేలకు పెరిగిపోయింది.

ఇది చూసి షాకైన ఆ మహిళ, ‘‘ఈ అసాధారణ రేటు’’పై ట్విట్టర్ ద్వారా సూపర్ మార్కెట్ కి ఫిర్యాదు చేస్తూ దీన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేసింది. దీంతో ఆ సూపర్ మార్కెట్ ప్రతినిధి ఒకరు దిగొచ్చాడు. చివరకు క్షమాపణ చెబుతూ బిల్లు వేయడంలో పొరపాటు జరిగిందని తప్పు అంగీకరించాడు. ఈలోగానే ట్విట్టర్స్‌లో సెటైర్లు వేసిన నెటిజన్స్, ఆమెని రకరకాలుగా ఆటపట్టించారు.

 

READ ALSO

Related News