గుడిదగ్గరే భర్త పీక కోసి చంపేసింది

భార్యల్ని హింసిస్తోన్న భర్తలన్నది ఒకప్పటి మాటలా మారిపోతోంది. ఇప్పుడు కొందరు భార్యలు ఏకంగా నమ్మించి భర్తల్ని నయవంచన చేస్తున్నారు. అంతేకాదు, ప్రేమగా తినేతిండిలో విషమిచ్చి చంపేస్తున్నారు. వరుసగా జరుగుతోన్న ఇలాంటి ఉదంతాలెన్నో. తాజాగా అంతకంటే క్రూరమైన ఘటన శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లోనే జరగడం విశేషం.

సిద్దిపేట జిల్లా నంగనూర్‌ మండలం ఘన్పూర్‌ గ్రామానికి చెందిన బండి బాలయ్య(37), భార్య నర్సవ్వతో కలిసి రాజన్న దర్శనార్థం సిరిసిల్లజిల్లా వేములవాడ వెళ్లారు. స్వామి దర్శనానంతరం ఆలయ సమీపంలోని స్థలంలో రాత్రి వంట చేసుకుని తిన్నారు. అక్కడే నిద్రించారు. అర్థరాత్రి సమయంలో తాగిన మత్తులో ఉన్న భర్తను తనవెంట తెచ్చుకున్న కత్తితో పీక కోసి చంపేసింది నర్సవ్వ. బాధితుడు ఆర్తనాదాలు విన్న సమీపంలోని భక్తులు అక్కడికి రావడంతో అక్కణ్నుంచి నర్సవ్వ పరారైంది. బాలయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబాన్ని మంచిగా ఉంచాలనుకుని బాలయ్య గల్ఫ్ వెళ్లి వస్తే, నర్సవ్వకు ఘన్పూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తాళికట్టిన భర్తనే హంతంచేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related News