మమతకు మూడినట్లే : షా

పశ్చిమ బెంగాల్  సీఎం మమతా బెనర్జీని గద్దె దింపడానికే తామిక్కడికి వచ్చామని అన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. ఓటు బ్యాంకు కన్నా తమకు మొదట దేశం ముఖ్యమని, దేశం తరువాతే ఏదైనా అని అన్నారు . కోల్ కతాలో శనివారం  తమ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. బంగ్లాదేశ్ ఇమ్మిగ్రెంట్లు మమత ఓటు బ్యాంకు కాదన్నారు. ఎన్నార్సీ‌ని అడ్డుకోవడానికి మమత యత్నిస్తున్నారని, అయితే ఎన్నార్సీ అన్నది అక్రమ వలసదారులను బయటకు పంపడానికే తప్ప..బంగ్లా ఇమ్మిగ్రెంట్లను కాదని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ వంటి గొప్ప గడ్డకు మమతా బెనర్జీ చాలా నష్టం కలిగించారని షా దుయ్యబట్టారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినవారికి మమత ఎందుకు మద్దతునిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఇందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ మేం బెంగాల్ కు వ్యతిరేకం కాదు..కేవలం ఆమెకే (మమతకే) వ్యతిరేకం ‘ అని చెప్పారు. కాగా-అంతకుముందు షా పర్యటనను నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది.

READ ALSO

Related News