సానియామీర్జా వీడియో వైరల్

సానియామీర్జాకి చెందిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ప్రెగ్నెంట్ కావడంతో కొద్దిరోజులపాటు ఆటకు రెస్ట్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల! రెండురోజుల కిందట తన సోదరి ఆనమ్‌‌తో కలిసి టెన్నిస్‌ ఆడుతున్న వీడియోను సానియా అభిమానులతో షేర్ చేసింది. ”ఎంత ప్రయత్నించినా టెన్నిస్‌‌కి దూరంగా ఉండలేకపోతున్నాను.. క్రీడాకారుల నుంచి కోర్టును దూరం చేయగలరేమో కానీ, ఆటను కాదు కదా” అని రాసుకొచ్చింది. ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్ గురించి చెప్పనక్కర్లేదు. మామ్‌ సానియా ఈజ్‌ బ్యాక్‌, సానియాపై గెలవడానికి ఆనమ్‌కి ఇదే మంచి ఛాన్స్ అంటూ రకరకాలుగా తమతమ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆటకు దూరమైనా, ఏదోవిధంగా అభిమానులతో టచ్‌లో ఉంటోంది సానియా.

READ ALSO

Related News