మల్టీఫ్లెక్స్‌లకు కోర్టు షాక్,25లక్షల ఫైన్

మల్టీఫ్లెక్స్‌లకు ఊహించని షాక్ ఇచ్చింది విజయవాడలోని కన్యూమర్ కోర్టు. థియేటర్లలో ఎమ్మార్పీ కంటే మూడు రెట్లు అధికంగా అమ్మకాలు సాగించడంపై కన్నెర్ర చేసింది. దీంతో వినియోగదారులు నష్టపోయిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో పరిహారం చెల్లించాలని మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాలను ఆదేశించింది. ఒక్కక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం ఐదు సంస్థలకు రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలలలోపు జిల్లా వినియోగదారుల ఫోరం వద్ద జమ చేయాలని తన తీర్పులో ప్రస్తావించింది.

విజయవాడలోని మల్టీఫ్లెక్స్‌లు టిక్కెట్లు, ఫుడ్ అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ కొందరు వినియోగదారులు.. గతేడాది ఏప్రిల్‌లో కన్యూమర్ కోర్టుని ఆశ్రయించారు. ఎల్‌ఈపీఎల్‌, ట్రెండ్‌సెట్‌, పీవీఆర్‌, పీవీపీ, ఐమ్యాక్స్ మల్టీఫ్లెక్స్‌ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీనిపై పలుమార్లు వాదప్రతివాదనలు జరిగాయి. సమగ్ర విచారణ చేసిన న్యాయమూర్తి మాధవరావు గురువారం సంచలన తీర్పు వెలువరించారు. ఇలాంటి మోసాలకు పాల్పడటం తప్పని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే థియేటర్స్‌కు వచ్చే కస్టమర్స్‌కు ఉచిత తాగునీరు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని, బయట నుంచి తీసుకొచ్చే ఫుడ్, కూల్ డ్రింక్స్‌ని అనుమతించాలని ఆదేశించారు.

READ ALSO

Related News