మాల్యా ఇంట్లో గోల్డెన్‌ టాయిలెట్‌

బ్యాంక్‌లకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌కి మార్చేసిన విజయ్‌మాల్యా గురించి లేటెస్ట్ న్యూస్. ఈయన ఇంట్లో గోల్డెన్‌ టాయిలెట్‌ వుంది. వినడానికి విచిత్రంగా వున్నా ముమ్మాటికీ నిజం. ఇంతకీ ఈ విషయం ఎలా బయటపడింది? ఇంతకీ మాల్యా అంతర్గత విషయాన్ని ఎవరు బయటపెట్టారు? అన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. లండన్‌లో మాల్యా వున్నప్పుడు తాను నాలుగు గంటల సేపు ఆయనతో గడిపానని రచయిత, ప్రొఫెసర్ జేమ్స్ క్రాబ్‌ట్రీ తెలియజేశారు.

తాను ఇంటికి వెళ్లేసరికి మాల్యా దిగాలుగా వున్నాడని, మద్యం సేవిస్తున్నాడని తెలిపారు. కాసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత వాష్ రూమ్‌కి వెళ్లానని, అక్కడున్న గోల్డెన్ టాయిలెట్‌ని చూసి తాను షాకయ్యానని వెల్లడించాడు. గోల్డ్‌తో చేసిన మూత కూడా ఉందని, టిష్యూ పేపర్‌ కూడా గోల్డెన్‌ అయితే బాగుండేదని తాను భావించానని, అక్కడ తెల్లటి టవల్స్‌ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల భారత్‌‌కి వచ్చిన జేమ్స్, ముంబైలో ఓ సమావేశంలో పాల్గొని మాల్యా గురించి ఈ విషయాలను వెల్లడించారు.

READ ALSO

Related News