బసవతారకం ఫస్ట్‌లుక్…?

బాలకృష్ణ- విద్యాబాలన్ జంటగా రానున్న ఎన్టీఆర్ బయోపిక్ చకచకా నడుస్తోంది. ఇందులో బసవతారకం రోల్‌లో కనిపించనుంది బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఈ చిత్రానికి సంబంధించి తన పార్ట్ ముగిసినట్లు విద్యా వెల్లడించింది. గురువారం ముంబైలో తన ఓ కార్యక్రమానికి హాజరైన విద్యాబాలన్, రాబోయే సినిమాల గురించి మీడియాతో ముచ్చటించింది.

ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు వరకు చాలా పంక్చువల్ గా షూట్ జరిగేదని, ఈ బయోపిక్ తాలూకు అనుభవం తనకెప్పటికీ గుర్తుండిపోతుందని విద్యాబాలన్ చెప్పింది. హిందీ వెర్షన్‌కి మాత్రమే తాను డైలాగ్స్ చెప్పానని, మిగతా భాషలకు చెప్పలేదని వివరించింది. గతంలో ఒకటీరొండు మలయాళ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశానంటున్న ఈ బాలీవుడ్ అమ్మడు.. పూర్తి నిడివి గల దక్షిణాది మూవీ ఎన్టీయార్ బయోపిక్ మాత్రమేనని చెప్పింది. ఎన్టీయార్ సహధర్మచారిణిగా బతికున్నంత కాలం ఆయన వెంటే నడిచిన బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ని క్రిష్ ఎలా చూపించాడన్నది ఆసక్తికరంగా మారింది. బసవతారకంగా విద్య వేసిన వేషం తాలూకు లుక్ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం వుంది.

 

READ ALSO

Related News