‘డర్టీ పాలిటిక్స్’.. ఇది హార్ధిక్‌పటేల్ సెక్స్ సీడీయేనా?

గుజరాత్‌లో ఓ సెక్స్ సీడీపై రాజకీయ దుమారం మొదలైంది. పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్ధిక్‌పటేల్‌దిగా చెబుతున్న
ఈ వీడియో సోషల్‌మీడియాలో హంగామా చేస్తోంది. ఈ ఏడాది మే 16న ఈ వీడియో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. హార్ధిక్‌ తరహాలోవున్న వ్యక్తి ఓ మహిళతో క్లోజ్‌గా వున్నట్లు వీడియోలో  స్పష్టంగా కనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల వేళ ఈ సీడీ
బయటపడడంతో.. ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని భావిస్తోందట బీజేపీ.

ఈ వీడియోపై హార్ధిక్‌పటేల్ స్పందించాడు. తన నైతికత మీద  దెబ్బకొట్టి గుజరాత్ ఎన్నికల్లో లాభపడేందుకే ఈ సీడీని బయట పెట్టారంటూ బీజేపీపై దుమ్మెత్తిపోశాడు. గుజరాత్ మహిళల ప్రతిష్ఠను దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇదో భాగమని, హార్ధిక్ ఎలాంటివాడో బీజేపీకి బాగా తెలుసని, అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించాడు. ఇప్పటికైనా ఇటువంటి డర్టీ పాలిటిక్స్ మానుకుంటే మంచిదని బీజేపీకి హితవు పలికాడు. ఈ సీడీని దేశం బయటే మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశాడు. ఆ రాష్ట్ర ఎన్నికల వేళ హార్ధిక్ ఇటీవలికాలంలో కాంగ్రెస్‌కు చేరువైన విషయం తెల్సిందే! గతంలో హార్ధిక్ ఉద్యమం చేస్తున్న సమయంలో కూడా ఇదే తరహా సీడీలు బయటకు వచ్చాయి.

Related News