తిరుమలలో వెంకయ్య.. ఈసారి స్పెషాలిటీ ఏమిటంటే..

ఉపరాష్ట్రపతి హోదాలో తొలిసారిగా తిరుమల‌ శ్రీవారిని దర్శించుకున్నారుఎం.వెంకయ్యనాయడు. పుష్కరిణికి చేరుకుని, తర్వాత వరాహస్వామివారికి నమస్కరించుకుని.. వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. సామాన్య భక్తులతో కలిసి క్యూలైన్లో ఆలయానికి వచ్చిన వెంకయ్యకి, ఆయన కుటుంబ సభ్యులకు.. ఆలయ అధికారులు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు.
శ్రీవారి దర్శనం తర్వాత వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంది వెంకయ్య కుటుంబం. బైటికొచ్చి మీడియాతో మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… మకరసంక్రాంతి మనందరి జీవితాల్లో నవ్యక్రాంతిని తీసుకురావాలని ఆకాంక్షించారు. పదవిరీత్యా ఉపరాష్ట్రపతి అయినప్పటికీ.. దేశ ద్వితీయ పౌరుడి హోదా ఉన్నప్పటికీ.. కామన్ మాన్ లా శ్రీవారి దర్శనం చేసుకున్న వెంకయ్యనాయుడు.. మళ్ళీ తన శైలిని గుర్తు చేశారు.

Related News