రాహుల్ హైదరాబాద్ టూర్, షాకింగ్ న్యూస్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ టూర్‌కి ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. సోమ, మంగళవారాల్లో తెలంగాణలో పర్యటించనున్నారు రాహుల్. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. టూర్‌లో భాగంగా ఓయూలో భారీ సభకు నేతలు ప్లాన్ చేశారు.

ఐతే, భద్రతా కారణాల వల్ల రాహుల్ మీటింగ్‌కు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఓయూ అధికారులు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన ఓయూ విద్యార్థులు హైకోర్టుకి వెళ్లినట్టు సమాచారం. మరోవైపు పబ్లిక్ మీటింగ్‌కు వీసీ అనుమతి నిరాకరించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు.

READ ALSO

Related News